ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్, కరోనా, లొక్డౌన్ నామధేయస్య...సహకుటుంబానామ్...

ABN, First Publish Date - 2020-04-04T14:14:58+05:30

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక జంట తమకు జన్మించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్ పూర్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో  ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక జంట తమకు జన్మించిన కవలలకు కరోనా, కోవిడ్ అని పేరు పెట్టారు. దీనికిముందు ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన పిల్లలకు కరోనా, లాక్‌డౌన్ అని పేరు పెట్టారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో లాక్డౌన్ మధ్య ప్రీతి వర్మ (27) కవలలకు జన్మనిచ్చింది. ఈ దంపతులు తమ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేరు పెట్టారు. తమ పిల్లల పేర్లు తమ కష్టాలపై విజయం, ఆసుపత్రి సహకారం రెండింటినీ గుర్తు చేస్తూనే ఉంటాయని తల్లిదండ్రులు అంటున్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తల్లీపిల్లలు పూర్తి ఆరోగ్యంతో  ఉన్నారని, లాక్ డౌన్ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రయత్నంలో ఈ జంట చాలా ఇబ్బంది పడ్డారని  ఆసుపత్రి ప్రజా సంబంధాల అధికారి శుభ్రా సింగ్ తెలిపారు. కాగా అప్పటికే ఆ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. లాక్ డౌన్ కారణంగా వారి  బంధువులు ఆసుపత్రికి రాలేకపోయారు. 


Updated Date - 2020-04-04T14:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising