ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచం వెతుకుతున్న భారతీయ ఫుడ్ ఏదో తెలుసా..

ABN, First Publish Date - 2020-02-04T00:12:05+05:30

2019లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికశాతం మంది చికెన్ బిర్యానీ కోసం తెగ వెతికేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ వంటకాలు, ఆ రుచులూ.. అబ్బో.. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వివిధ ప్రాంతాల వంటకాల మధ్య ఉన్న వైవిధ్యం మరెంతో ఆకట్టుకుట్టుంది. పాశ్చాత్య దేశాల్లో కూడా మన ఫుడ్ అంటే చెవికోసుకునే వారు ఎంతో మంది ఉన్నారు. భారతీయ ఆహారం అందించే రెస్టారెంట్లు తమ దగ్గర్లో ఎక్కడైనా ఉన్నాయా అంటూ అప్పుడప్పుడూ గూగుల్‌లో వెతుకుతుంటారు. మరి వారు ఎక్కువగా సెర్చ్ చేసేది ఏ వంటకం గురించి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

సెమ్‌రష్ అనే సంస్థ ఈ ప్రశ్నకే సమాధానాన్ని వెతికిపట్టుకుంది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికశాతం మంది చికెన్ బిర్యానీ కోసం తెగ వెతికేశారట. లెక్కలతో సహా చెప్పుకోవాలంటే ఆ సంవత్సరంలో మొత్తం 4.5 లక్షల సెర్చ్‌‌లు దీనిపైనే జరిగాయి. చికెన్ బిర్యానీ తరువాతి స్థానాలను వరుసగా బటర్ చికెన్, సమోసాలు ఆక్రమించాయట. ఈ నవాబుల ఆహారానికి ప్రపంచం కూడా ఫిదా అయిపోయిందంటూ సెమ్‌రష్ పేర్కొంది.

Updated Date - 2020-02-04T00:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising