ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మెట్‌ఫార్మిన్‌’తో కరోనాకు చెక్‌!

ABN, First Publish Date - 2020-07-04T07:11:30+05:30

కరోనా రోగులకు ప్రాణగండాన్ని తప్పించే మరో ఔషధం వెలుగులోకి వచ్చింది. టైప్‌-2 మధుమేహం(షుగర్‌) నియంత్రణకు వినియోగించే ప్రాథమిక ఔషధాల్లో ఒకటైన ‘మెట్‌ఫార్మిన్‌’తో కొవిడ్‌ రోగుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతోందని చైనాలోని వూహాన్‌ వైద్యులు ప్రకటించారు. ఈ మందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(మెడికల్‌), జూలై 3 : కరోనా రోగులకు ప్రాణగండాన్ని తప్పించే మరో ఔషధం వెలుగులోకి వచ్చింది. టైప్‌-2 మధుమేహం(షుగర్‌) నియంత్రణకు వినియోగించే ప్రాథమిక ఔషధాల్లో ఒకటైన ‘మెట్‌ఫార్మిన్‌’తో కొవిడ్‌ రోగుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతోందని చైనాలోని వూహాన్‌ వైద్యులు ప్రకటించారు. ఈ మందు అందించిన కరోనా రోగుల్లో వాపులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా వారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడగలిగినట్లు వెల్లడించారు. మెట్‌ఫార్మిన్‌ను వాడని మధుమేహులతో పోల్చితే.. దీన్ని వాడిన రోగుల్లో మరణాలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై వూహాన్‌ వైద్యుల వాదనతో అమెరికాలోని మిన్నెసోటా వర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఏకీభవించారు. ఈ ఒక్క టాబ్లెట్‌ ధర 3 పైసలే. అంటే ఒక్క రూపాయి వెచ్చిస్తే 33 మాత్రలు వస్తాయన్న మాట. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నిరుపేద ప్రజలకు ఇది తీపి కబురనే చెప్పాలి. కరోనా రోగుల మరణాల రేటును తగ్గించేందుకు డెక్సామెథసోన్‌ అనే అతిచౌక స్ట్టీరాయిడ్‌ సంజీవనిలా పనికొస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు అదే కోవలో దివ్య ఔషధిలా పనికొచ్చే మరో చౌక ఔషధం(మెట్‌ఫార్మిన్‌) వెలుగులోకి రావడాన్ని సానుకూల పరిణామంగానే చెప్పొచ్చు.

Updated Date - 2020-07-04T07:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising