ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవి దున్నలు చెప్పిన బతుకు పాఠం.. వైరల్ వీడియో..!

ABN, First Publish Date - 2020-09-27T17:28:16+05:30

అడవి దున్నలు చెప్పిన బతుకు పాఠం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉచ్చు బిగిసింది.. అంతా రెడీ.. సింహాలన్నీ కాచుకుకూర్చున్నాయి. అదను కోసం ఎదురు చూస్తున్నాయి. అడవి దున్నల గుంపే వాటి టార్గెట్! దున్నలు కూడా పొంచి ఉన్న ప్రాణాపాయాన్ని గ్రహించాయి. నోరు తెరిచిన మృత్యువును గమనించాయి! చావు బతుకుల ఆట మొదలైంది.


అయితే ప్రకృతి ఎంతో చిత్రమైనది.. జయాపజయాలకి, చాపు పుట్టుకులకు ఇక్కడ సమానావకాశాలు ఉంటాయి. ఎక్కువతక్కువలకు చోటు ఉండదు! మరణం ఖాయం అనుకున్న సందర్భాల్లో నూరేళ్ల జీవితం లభిస్తుంది. అంతా హ్యాపీ అనుకున్న టైంలో మొత్తం తల్లకిందులవుతుంది.


ఇక్కడ కూడా అదే జరిగింది. పంజా విసురుదామనుకుంటున్న సింహాలకు ఊహించని షాక్! అడవి దున్నల మంద సింహాలపై యుద్ధం ప్రకటించింది. భూమి దద్దరిల్లేలా దున్నలన్నీ ఒక్కసారిగా సింహాల వైపు కదను తొక్కాయి. వాటి వాడి కొమ్ములు...భారీ కాయాలు చూసిన మృగరాజుల గుండే జారిపోయింది. ఉచ్చులు, పంజా విసరటాలు మర్చిపోయి.. అవి ప్రాణ భయంతో అక్కడి నుంచి తుర్రుమన్నాయి. 


ఇదీ ఆఫ్రికా అడవుల్లో ఇటీవల జరిగిన ఉదంతం. అక్కడి సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులు తీసిన వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఇటువంటి దృశ్యాలు సాధారణమే అయినా ఇందులోని నీతి మాత్రం నెటిజన్ల దృష్టి దాటిపోలేదు. దున్నలు చెప్పుతున్న బతుకు పాఠం తాము గుర్తించామంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఐకమత్యంతో అద్భుతాలు సాధ్యం అని ఒకరంటే..కలసి ఉంటేనే విజయం తథ్యం అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ ఐదు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 



Updated Date - 2020-09-27T17:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising