ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వధువుగా కౌన్సెలింగ్ సెంటర్‌కు... ప్రభుత్వ టీచర్‌గా అత్తారింటికి!

ABN, First Publish Date - 2020-12-05T14:28:34+05:30

అంతవరకూ కల్యాణమండపంలో కూర్చుని పెళ్లి తంతులో పాల్గొన్న వధువు... పెళ్లి కూతురి అలంకరణలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోండా: అంతవరకూ కల్యాణమండపంలో కూర్చుని పెళ్లి తంతులో పాల్గొన్న వధువు... పెళ్లి కూతురి అలంకరణలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యింది. అక్కడ విజయం సాధించి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఆనందంతో అత్తారింట అడుగుపెట్టింది. ఈ ఆసక్తికర ఉదంతం యూపీలోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది. గోండాలోని రామ్‌నగర్ పరిధిలో గల బారాబంకీ ప్రాంతానికి చెందిన ప్రజ్ఞా తివారీ చేతులకు గోరింట, కాళ్లకు పారాణి, నుదుటన సింధూరంతో వధువు గెటప్‌లో తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పట్టుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యింది.


అక్కడ కౌన్సెలింగ్ పూర్తయ్యాక, ప్రజ్ఞా తివారీ ఆనందంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రజ్ఞా తివారీ మాట్లాడుతూ తనకు కెరియర్ ఎంతో ముఖ్యమని, అందుకే టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి, ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌కు హాజరయ్యానని తెలిపారు. తల్లిదండ్రులంతా తమ కుమార్తెల కెరియర్‌కు సహకరించాలని కోరారు. ప్రజ్ఞా తివారీ గురించి విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఆమెకు నిన్న రాత్రే వివాహమయ్యిదని, ఉదయం ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌కు హాజరై ప్రభుత్వ టీచర్‌గా సెలక్ట్ అయ్యారని తెలిపారు. ప్రజ్ఞా తివారీ గోండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. 

Updated Date - 2020-12-05T14:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising