ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లని యువకుడు... షాకవుతున్న వైద్యులు!

ABN, First Publish Date - 2020-11-22T12:12:11+05:30

ఆ యువకునికి 16 ఏళ్లు, విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. రోజూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మురౌనా: ఆ యువకునికి 16 ఏళ్లు, విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. రోజూ 18 నుంచి 20 రొట్టెలు తింటున్నప్పటికీ గడచిన 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లనేలేదు. అయినా ఆ యువకునికి ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురుకాలేదు. ఆ యువకుని కుటుంబ సభ్యులు ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. తమ కుమారునికి ఏదో వింతవ్యాధి సోకిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విచిత్ర ఉదంతం మధ్యప్రదేశ్‌లోని మురౌనా జిల్లాలో చోటుచేసుకుంది.


ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు కూడా అతనికున్న వ్యాధి ఏమిటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మనోజ్ చాందిల్ కుమారుడు ఆశీష్ గడచిన 18 నెలలుగా మలమూత్రాలు విసర్జించేందుకు టాయిలెట్‌కు వెళ్లలేదు. దీంతో ఆశీష్‌ను అతని కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలోని చాలామంది వైద్యులకు చూపించారు. ఈ నేపధ్యంలో అనేక రకాల వైద్య పరీక్షలు చేశారు. అయినప్పటికీ ఆతనికున్న వ్యాధి ఏమిటో వైద్యులకు కూడా అంతుచిక్కలేదు. కాగా ఆశీష్ రోజుకు 18 నుంచి 20 రొట్టెలు తింటుంటాడు. మలమూత్ర విసర్జన జరగకపోయినప్పటికీ అతనికి ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురుకాలేదు. దీంతో ఆశీష్‌ను కుటుంబ సభ్యులు వైద్యుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. 


Updated Date - 2020-11-22T12:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising