ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎండబ్ల్యులో చెత్త ఎత్తుతున్న యువకుడు.... కారణమిదే!

ABN, First Publish Date - 2020-11-24T12:05:20+05:30

జార్ఖండ్‌లోని రాంచీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన లగ్జరీ కారు బీఎండబ్ల్యులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన లగ్జరీ కారు బీఎండబ్ల్యులో రోడ్డుపై ఉన్న చెత్తను ఎత్తుతూ కనిపిస్తున్నాడు. రాంచీకి చెందిన యువ వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ్ తన డ్రీమ్ కారులో చెత్త ఎత్తడం చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ శ్రీవాస్తవ్ తన తండ్రికి కానుకగా ఇచ్చేందుకు బీఎండబ్ల్యు కారు కొనుగోలు చేశారు. అయితే ఆ కారు కొన్నదగ్గరి నుంచి అతనికి సమస్యలు ఎక్కువయ్యాయి. 


బీఎండబ్ల్యు సర్వీస్ సెంటర్‌లో మరమ్మతులు చేయించినప్పటికీ ఆ కారు ట్రబుల్ ఇస్తూనే ఉంది. దీంతో అతను తన బీఎండబ్ల్యు కారును రోడ్డుపై పడిన చెత్తను ఎత్తేందుకు వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ క్రికెటర్స్ ఈషాన్ కిషన్, రంజీ క్రికెటర్ అజాతశత్రు కూడా కార్లలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని తెలిపారు. తరచూ కారుకు మరమ్మతు చేయించాల్సి వస్తున్నదని, ఇందుకు లెక్కకుమించి ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ కారును సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకు వెళుతుండటంతో సెంటర్ యజమానులు కూడా విసుగు చెందున్నారన్నారు. ఈ విషయమై తాను త్వరలో కోర్టుకు వెళతానని తెలిపారు.

Updated Date - 2020-11-24T12:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising