‘కొవిడ్’కు బ్లడ్ పాయిజనింగ్ తోడైతే పెనుముప్పు
ABN, First Publish Date - 2020-12-29T09:12:33+05:30
తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి రక్త ఇన్ఫెక్షన్(బ్లడ్ పాయిజనింగ్) సమస్యలు తోడైతే తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి
న్యూయార్క్, డిసెంబరు 28: తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి రక్త ఇన్ఫెక్షన్(బ్లడ్ పాయిజనింగ్) సమస్యలు తోడైతే తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటి వారి రక్త ప్రవాహంలోకి బ్యాక్టీరియాలు ప్రవేశించి శరీరమంతటికీ ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసే ముప్పు పొంచివుందని హెచ్చరించారు. దీంతో రోగులు తీవ్రంగా నీరసించి, ఆస్పత్రుల్లో ఎక్కువకాలం చికిత్సపొందాల్సి వస్తుందన్నారు. మానసిక రుగ్మతలతోపాటు రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటం, సెప్టిక్ షాక్ వంటి సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 375 మంది రోగులపై 3నెలల అధ్యయనంలో ఈ విషయాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
Updated Date - 2020-12-29T09:12:33+05:30 IST