ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైకిల్ తీసుకుని... క్ష‌మాప‌ణ చీటీ రాసిన‌ వ‌ల‌స కార్మికుడు!

ABN, First Publish Date - 2020-05-16T17:58:14+05:30

పెరుగుతున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించారు. ఇది వ‌ల‌స కార్మికులకు సమస్యగా మారింది. ప‌ట్ట‌ణంలో ఉపాధి కోల్పోవ‌డంతో తమ గ్రామాల్లోని త‌మ ఇళ్లకు న‌డుచుకుంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భరత్‌పూర్‌: పెరుగుతున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించారు. ఇది వ‌ల‌స కార్మికులకు సమస్యగా మారింది. ప‌ట్ట‌ణంలో ఉపాధి కోల్పోవ‌డంతో తమ గ్రామాల్లోని త‌మ ఇళ్లకు న‌డుచుకుంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని భ‌రత్‌పూర్‌లో ఒక ఆస‌క్తిక‌ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక కార్మికుడు స్థానికంగా ఉంటున్న ఒక వ్య‌క్తి సైకిల్ తీసుకుని వెళ్లాడు. అయితే ఈ సంద‌ర్భంగా ఒక లేఖ‌రాసి అక్క‌డ‌పెట్టి వెళ్లిపోయాడు. ఈ లేఖ ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో కార్మికుడు.. నేను మీ సైకిల్ తీసుకుంటున్నాను. నన్ను క్ష‌మించండి. నాకు ఇంటికి వెళ్లేందుకు మ‌రో మార్గం లేదు. నాకు కుమారుడు ఉన్నాడు. నేను అతని కోసం ఇలా చేయాల్సి వ‌చ్చింది. అతను వికలాంగుడు. అస్స‌లు నడవలేడు. మేము బరేలీ వెళ్ళాలి... అని రాశాడు. ఈ సంద‌ర్భంగా ఆ సైకిల్ యజమాని సహబ్ సింగ్ మాట్లాడుతూ నా సైకిల్ అవ‌స‌ర‌మైన‌వారికి ఉప‌యోగ‌ప‌డినందుకు సంతోషిస్తున్నాను.  మా ఇంటి ప్ర‌హారీ లోప‌ల అనేక వ‌స్తువులు ఉన్నాయి. అయినా ఆ వ్య‌క్తి సైకిల్ మాత్ర‌మే తీసుకుని వెళ్లాడ‌ని తెలిపారు. 

Updated Date - 2020-05-16T17:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising