ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్: ఒక్క యాప్‌తో నిత్యావసరాల బెంగ తీర్చిన టెకీ..

ABN, First Publish Date - 2020-04-06T18:45:05+05:30

లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కొరతపై ప్రజల్లో ఆందోళనకు చెక్ పెడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కొరతపై ప్రజల్లో ఆందోళనకు చెక్ పెడుతూ బెంగళూరుకు చెందిన ఓ టెకీ సరికొత్త యాప్ ఆవిష్కరించాడు. ‘నైబర్‌వుడ్ సప్లై’ పేరుతో ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు స్టార్టప్ కంపెనీ ఎస్పర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘వినియోగాదారులు తమ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి సురక్షితంగా, క్షేమంగా నిత్యావసరాలు తెచ్చుకునేలా మా టెకీ కిరణ్ ఆంటో ఓ యాప్‌ను ఆవిష్కరించారు. ప్రజలే కాంట్రిబ్యూటర్లుగా చేరి.. తమ ప్రాంతంలోని షాపులు, వ్యాపారులు, వారి ప్రాంతాలను పొందుపర్చడం  ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది...’’ అని ఎస్పర్ పేర్కొంది. నిత్యావసరాలు, మెడిసిన్, మాస్కులు, శానిటైజర్ల వంటి హెల్త్ కేర్ పరికరాలు దొరికే షాపులు ఈ యాప్‌తో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.


లొకేషన్ సాయంతో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో, అక్కడికెలా వెళ్లి కావాల్సినవి తెచ్చుకోవచ్చో ఈ యాప్ అలర్ట్ చేస్తుంది. నిత్యవసరాల జాబితా పొందుపర్చిన తర్వాత... వ్యాపారులు ఎప్పటికప్పుడు సరుకుల వివరాలు అప్‌డేట్ చెయ్యొచ్చు. కర్నాటక, కేరళ, న్యూఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈ యాప్ అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ‘‘ఈ యాప్ ద్వారా ఓ ప్రాంతంలో మంచి నెట్‌వర్క్ ఏర్పడడమే కాకుండా... నిత్యావరాలను నిశ్చింతగా తెచ్చుకునేందుకు  తోడ్పడుతుంది...’’ అని ‘నైబర్‌వుడ్ సప్లై’ సృష్టికర్త ఆంటో పేర్కొన్నాడు. 

Updated Date - 2020-04-06T18:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising