ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ వైపు ఏమీ తెలియని పసితనం.. మరోవైపు హృదయ విదారకం.. సోషల్ మీడియాలో వైరల్

ABN, First Publish Date - 2020-05-27T20:45:56+05:30

లాక్‌డౌన్, కరోనా పరిస్థితులు దేశంలో అనేక హృదయ విదారక సంఘటనలను రికార్డు చేస్తున్నాయి. కవి శ్రీశ్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : లాక్‌డౌన్, కరోనా పరిస్థితులు దేశంలో అనేక హృదయ విదారక సంఘటనలను రికార్డు చేస్తున్నాయి. కవి శ్రీశ్రీ అన్నట్లు.. పాపం పుణ్యం ప్రపంచ మార్గం... కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు... ఏమీ ఎరుగని పువ్వుల్లారా... ఐదారేడుల పాపల్లారా... అని ‘‘శైశవ గీతి’’ లో చిన్నారుల మనస్తత్వం ఎలా ఉంటుందో పేర్కొన్నారు. అచ్చు ఇలాగే ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బిహార్‌లోని ఓ రైల్వేస్టేషన్...చుట్టూ మూగిన మనుషులు.... అలా చూస్తూ స్థాణువుల్లా నిల్చున్నారు.  ఉష్ణోగ్రతలు పెరగడం, డీహైడ్రేషన్, మరో పక్క ఆకలి ఓ తల్లి ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహంపై ఓ బట్ట కప్పి ఉంది. తల్లి ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలియని ఆ పసి కూన... ఆ తల్లి శవంపై కప్పి ఉంచిన బట్టతో ఆడుకుంటున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 


వివరాల్లోకి వెళితే.. శ్రామిక్ రైల్‌లో ఓ తల్లి తన చంటిబిడ్డతో కలిసి గుజరాత్ నుంచి ఆదివారం బయల్దేరింది. సోమవారం బిహార్‌లోని ముజఫరా పూర్‌కు చేరుకుంది. అయితే ఆమె రైలులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె డెడ్ బాడీని కిందకు దించిన రైల్వే సిబ్బంది.. ప్లాట్‌ఫామ్‌పై పెట్టి, ఓ బట్ట కప్పి వెళ్లిపోయారు. చంటి పిల్లవాడికి తల్లి ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలియలేదు. తల్లిని నిద్రలోంచి లేపడానికి ప్రయత్నించడమే కాకుండా.. మృతదేహంపై ఉన్న బట్టతో ఆడుకుంటున్నాడు.


ఇతరులు ఆ పిల్లవాడిని అక్కడి నుంచి లాగే వరకూ తల్లిని మేల్కొలపడానికి ఆ చిన్నారి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతటి హృదయ విదారక సంఘటనపై రైల్వే శాఖ స్పందించింది. అనారోగ్యం కారణంగా ఆ మహిళ మృతి చెందిందని, మృతదేహాన్ని ముజఫరాపూర్ రైల్వే స్టేషన్‌లో ఉంచమని బంధువులు సూచించారని, అందుకే తాము అలా చేశామని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-05-27T20:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising