ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ-బెంగళూరు ఇండిగో విమానంలో గర్భిణి ప్రసవం

ABN, First Publish Date - 2020-10-08T12:32:31+05:30

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రసవించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రసవించింది.ఢిల్లీ నుంచి బెంగళూరుకు  ఇండిగో 6ఈ 122 విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నెలలు నిండకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఇండిగో ఎయిర్ లైన్సు అధికారులు చెప్పారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ల్యాండ్ అయిన వెంటనే ఇండిగో విమానంలో నుంచి తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. విమానంలోనుంచి వీల్ ఛైరులో దిగిన బాలింత, పసికందులకు విమానాశ్రయంలో సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇండిగో విమానంలో రాత్రి 6.10 గంటలకు మహిళ ప్రసవించిందని విమాన కెప్టెన్ క్రిష్టోఫర్ ట్వీట్ చేశారు. తల్లీ బిడ్డలకు విమాన సిబ్బంది సేవలందించారు. తమ విమానంలో తల్లి బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-08T12:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising