ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాని ఓడించిన 108 ఏళ్ల వృద్దురాలు

ABN, First Publish Date - 2020-09-10T17:11:38+05:30

ఔషధాల కన్నా ఆత్మస్థయిర్యమే కరోనాకు ఉత్తమ చికిత్స అని 108 ఏళ్ల దులారీ దేవి నిరూపించింది. యూపీలోని ఆజమ్‌గఢ్ మెడికల్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలిని డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ దీపక్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆజమ్‌గఢ్: ఔషధాల కన్నా ఆత్మస్థయిర్యమే కరోనాకు ఉత్తమ చికిత్స అని 108 ఏళ్ల దులారీ దేవి నిరూపించింది. యూపీలోని ఆజమ్‌గఢ్ మెడికల్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలిని డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ దీపక్ పాండ్యాలు ఘనంగా స్వాగతించారు. ఆ వృద్ధురాలు కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని, కుటుంబ సభ్యులతో పాటు ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నియాజ్ హసన్ మాట్లాడుతూ బలియా ప్రాంతానికి చెందిన దులారీ దేవి(108) దగ్గు- జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడంతో కరోనా పరీక్షలు చేశామన్నారు. 



ఆమెకు కరోనా సోకిందని తేలడంతో, ఆగస్టు 31న దులారీ దేవిని మెడికాలేజీలో అడ్మిట్ చేశారన్నారు. వందేళ్లు దాటిన ఆమెకు కరోనా సోకడంతో అటు కుటుంబ సభ్యులతోపాటు ఇటు ఆసుపత్రి సిబ్బంది సైతం ఆందోళనకు గురయ్యారన్నారు. అయితే ఆమె అత్యంత ధైర్యంగా ఉంటూ, చికిత్స తీసుకున్నదన్నారు. సెప్టెంబరు 9న ఆమెకు తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అదేరోజు సాయంత్రం ఆమె కుటుంబ సభ్యులతో సహా తమ ఇంటికి వెళ్లిందని తెలిపారు. 

Updated Date - 2020-09-10T17:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising