ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వంటింట్లో ఉన్నట్టుంది, వెంటనే చంపేయాలి, స్పాట్‌లో డబ్బు ఇస్తా’

ABN, First Publish Date - 2020-02-22T01:31:06+05:30

బొద్దింకను చంపితే 20 డాలర్ల పారితోషికం. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న యాడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాన్‌బెర్రా: భార్గవ్ ఛావడా(24) అని బ్రిస్బేన్‌లో(ఆస్ట్రేలియా) నివసిస్తుంటాడు. అతడో స్టూడెంట్. ఇటీవల ఓ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాక అతడు ఫ్రిజ్ తలుపు తీసాడు. తినడానికి ఏముందా అని వెతుకుతున్నాడు. ఇంతలో ఫ్రిజ్‌లో నుంచి ఏదో తనవైపు ఎగిరొచ్చింది. అతడు ఒక్కసారిగా భయపడ్డాడు. తనవైపు ఎగిరొచ్చిందేంటో గుర్తు పట్టేలోపే అది..వంటింటి వైపు వెళ్లిపోయింది. రాత్రి సమయంలో ఇటువంటిది జరగడంతో అతడు భయంతో వణికిపోయాడు.  ఆ భయం నుంచి తేరుకున్నాక అతిడికి అసలు విషయం బోధపడింది. తనను అంతలా భయపెట్టింది ఓ బొద్దింక అని తెలిసి అతడికి తిక్కరేగింది. ఆ బొద్దింక లివింగ్ రూమ్‌లోనో లేదా వంట గదిలో దాక్కుందని అతడు గుర్తించాడు. అది ఇంట్లో ఉండగా తాను ప్రశాంతంగా నిద్రపోలేనని అతడికి అర్థం అయింది. 


వెంటనే ల్యాప్‌టాప్ ఆన్ చేశాడు. ఆన్‌లైన్‌లో ఓ యాడ్ పోస్ట్ చేశాడు. ‘ఓ బొద్దింక వెంటనే చావాలి. 20 డాలర్లు(రూ. 950) స్పాట్‌లో ఇచ్చేస్తా. బొద్దింక.. కిచెన్‌లోనో లివింగ్ రూం లోనో దాక్కుంది. అవసరమైతే మీ వెంట స్ర్పే కూడా తెచ్చుకోండి. నా దగ్గర చీపురు, దుస్తులు తప్ప మరేమీ లేవు. వీలైనంత తొందరగా స్పందించండి.’ అంటూ యాడ్ పెట్టాడు. అయితే నెటిజన్లు మాత్రం అతడిని సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో పాపం భార్గవ్ భాదపడ్డాడు. ‘ ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. భలే కామిడీ చేశావ్.. మంచి జోక్ అంటూ కామెంట్లు పెట్టారు తప్ప ఒక్కరూ నేను ఆశించనట్లు స్పందించలేదు’ అని వాపోయాడు. అర్థరాత్రి అయినా ఎవరూ భార్గవ్ ఇంటి తలుపు తట్టకపోవడంతో తనే చేయిచేసుకోవాల్సి వచ్చింది.


Updated Date - 2020-02-22T01:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising