ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంట మోగిస్తున్న వాతావరణం.. మనకు వినపడటం లేదంతే..

ABN, First Publish Date - 2020-07-12T00:02:48+05:30

భూ వాతావరణం భారీ గంట మోగినట్లు శబ్దం చేస్తోందట. ఈ శబ్దం భూమి మొత్తం వినపడుతున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోనోలులు: భూ వాతావరణం భారీ గంట మోగినట్లు శబ్దం చేస్తోందట. ఈ శబ్దం భూమి మొత్తం వినపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు హవాయి యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. భూమిపై ఉన్న మొత్తం వాతావరణం భారీ శబ్దం చేస్తోందని, కానీ ఆ శబ్దం తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండడం వల్ల జీవరాశికి వినపడడం లేదని చెప్పారు. దాదాపు రెండు శతాబ్దాలుగా దీనికి సంబంధించి అనేక థియరీలు వెలుగులోకి వచ్చాయని, అయితే వాటిపై తాము మరింత పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ శబ్దం వాతావరణ ఒత్తిడి రూపంలో భారీ తరంగాలుగా భూమధ్య రేఖ మీదుగా ప్రయాణిస్తోందని తెలిపారు. ఈ తరంగాలలో కొన్ని తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుండగా, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నాయి.


దీనికోసం దాదాపు 38 ఏళ్లుగా వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులను పరిగణలోకి తీసుకునట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పరిశోధన భూ వాతావరణంపై మరింతగా దృష్టిపెట్టేలా చేసిందని, ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు చుట్టూ ఉన్నాయని రుజువు చేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Updated Date - 2020-07-12T00:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising