ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన సొరంగ ‌మార్గం సిద్ధం... త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

ABN, First Publish Date - 2020-08-27T11:09:17+05:30

ప్ర‌పంచంలోనే అతిపొడ‌వైన సొరంగ మార్గం మ‌న‌దేశంలో క‌నువిందు చేయ‌నుంది. 10 వేల అడుగుల ఎత్తులో చేప‌ట్టిన ఈ సొరంగ‌మార్గం నిర్మాణం పూర్తిచేసుకుంది. దీని నిర్మాణానికి పదేళ్లు పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ల‌దాక్‌: ప్ర‌పంచంలోనే అతిపొడ‌వైన సొరంగ మార్గం మ‌న‌దేశంలో క‌నువిందు చేయ‌నుంది. 10 వేల అడుగుల ఎత్తులో చేప‌ట్టిన ఈ సొరంగ‌మార్గం నిర్మాణం పూర్తిచేసుకుంది. దీని నిర్మాణానికి పదేళ్లు పట్టింది. ఇది మనాలి లేహ్‌ హైవేపై రోహ్తాంగ్ పాస్ కింద నిర్మిస్తున్నారు. ఇది ల‌దాక్‌తో అనుసంధాన‌మ‌వుతుంది. ఈ సొరంగ మార్గం ఈ కారణంగా మనాలి- లేహ్‌ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్లు తగ్గ‌నుంది. ఈ సొరంగ మార్గం పేరు అటల్ రోహ్తాంగ్ టన్నెల్. దీనికి మాజీ ప్రధాని, భారత‌ రత్న అటల్ బిహారీ వాజ‌పేయి పేరు పెట్టారు.


10,171 అడుగుల ఎత్తులో నిర్మిత‌మైన‌ ఈ అటల్ రోహ్తాంగ్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్త‌యిన,‌ పొడవైన రహదారి సొరంగం మార్గం. ఇది సుమారు 8.8 కిలోమీట‌ర్ల  వెడ‌ల్పును క‌లిగివుంది.  ఈ నూత‌న సొంగమార్గం నిర్మాణంతో మనాలి నుంచి లేహ్‌కు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబరు చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించ‌నున్నారు. ఈ సొరంగం మనాలిని లేహ్‌తో అనుసంధానించడమే కాకుండా, హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్-స్పితిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. ఇది లాహోల్-స్పితి జిల్లాను కులు జిల్లాలోని మనాలితో కలుపుతుంది. లదాఖ్‌లో మోహరించిన భారత సైనికుల‌కు ఈ సొరంగ మార్గం  కార‌ణంగా ఎంతో ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. శీతాకాలంలో ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభత‌ర‌మ‌వుతుంది. ఈ సొరంగం లోపల ఏ వాహనం అయినా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అవ‌కాశ‌ముంది. 


దీని నిర్మాణం 2010, జూన్ 28న‌ ప్రారంభ‌మ‌య్యింది. దీనిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) నిర్మించింది. ఈ సొరంగం గుర్రపుడెక్క ఆకారంలో నిర్మిత‌మ‌య్యింది. ‌బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, సిబ్బంది దీనిని నిర్మించేందుకు ఎంతో శ్ర‌మించారు.  శీతాకాలంలో ఈ ప్రాంతంలో పనిచేయడం చాలా కష్టం. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల వరకు ప‌డిపోతుంటాయి. ఈ సొరంగం నిర్మాణ సమయంలో 8 లక్ష క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని త‌వ్వితీశారు. వేసవిలో రోజుకు ఐదు మీటర్లు మేర‌కు తవ్వ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, శీతాకాలంలో ఇది అర మీటరు మాత్ర‌మే త‌వ్వ‌గ‌లిగేవారు. కాగా 3000 కార్లు లేదా 1500 ట్రక్కులు ఒకేసారి బయటకు వచ్చే విధంగా ఈ సొరంగ మార్గం నిర్మిత‌మ‌య్యింది. సుమారు రూ. 4 వేల కోట్ల రూపాయలు వెచ్చించి, ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుస‌రించారు. ఇందులోని వెంటిలేషన్ వ్యవస్థ కూడా ఆస్ట్రేలియన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2020-08-27T11:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising