ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్.. ఈ రోజే..

ABN, First Publish Date - 2020-11-15T03:19:02+05:30

ఈ రోజు దీపావళి. భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో నాసా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్త చెప్పారు. నవంబరు 14వ తేదీ అంటే ఈ రోజు భూమి వైపునకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాసింగ్టన్: ఈ రోజు దీపావళి. భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో నాసా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్త చెప్పారు. నవంబరు 14వ తేదీ అంటే ఈ రోజు భూమి వైపునకు రెండు ఆస్టరాయిడ్లు దూసుకొస్తున్నాయట. ఈ రెండింటిలో ఒక ఆస్టరాయిడ్ ఈ రోజే భూమిని దాటి వెళ్తుందని, ఇది చాలా ప్రమాదకరమైనదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ పరిమాణం 175 మీటర్లని, ఈ ఆస్టరాయిడ్ గంటకు 28,646 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు. దీనికి ఆస్టరాయిడ్ 2020 ఎస్‌టీ1 అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. నాసాకు చెందిన నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం..  ఆ ఆస్టరాయిడ్.. మన తాజ్ మహల్ కన్నా రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ మన భూమికి అతి చేరువలోకి వస్తుందని, ఆ సమయంలో అయస్కాంత క్షేత్రంలో ఏమైనా కుదుపులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా.


ఇదిలా ఉంటే భూ గ్రహంవైపు వస్తున్న మరొక ఆస్టరాయిడ్‌కు నాసా.. ఆస్టరాయిడ్-2020 టీబీ9 అని పేరు పెట్టింది. దీని పరిమాణం 30 మీటర్లు. ఇది ఓ విమానం పరిమాణంలో ఉంటుందట. ఇది గంటకు 21,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రరాయిడ్ కూడా భూమికి చేరువ నుంచే వెళ్లనుందని నాసా చెబుతోంది.

Updated Date - 2020-11-15T03:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising