ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంతుప్రేమికులారా.. పోలీసుల అనుమతితో బయటికెళ్లొచ్చు!

ABN, First Publish Date - 2020-03-29T17:00:48+05:30

కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలంటూ దేశ ప్రధాని నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ గొంతెత్తి చెబుతున్న మాట ఇదే. కరోనా వైరస్‌కు మందులేదు.. నివారణ మాత్రమే దానికి అడ్డుకట్ట అంటూ వైద్యులు ఇంకా గట్టిగా చెబుతున్నారు. ఎవరూ బయటకు రాకూడదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మూగజీవాల పరిస్థితి ఏంటి? రోడ్డుపై తిరుగాడే, గోశాలలో ఉండే ప్రాణుల రక్షణ ఎలా? దీనిపై దృష్టి పెట్టాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను బీజేపీ నేత మనేకా గాంధీ కోరారు. అంతేగాక పలువురు జంతుప్రేమికుల అభ్యర్థన మేరకు రాష్ట్రాలకు బోర్డు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మూగజీవాలకు ఆహార వసతి ఏర్పాటు చేసేవారికి బయటకు వెళ్లే అనుమతి ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.  


ఇంటి పరిసరాలలోని మూగజీవాలు లేదా గోశాలలోని గోవులు గ్రాసం దొరక్క ఆకలితో అలమటిస్తుంటే..  పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకొని గ్రాసం ఏర్పాటు చేయొచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. అదేవిధంగా గోశాలలోని ఇబ్బందికర పరిస్థితులపై సంబంధిత జిల్లా కలెక్టర్ లేదా మునిసిపల్ ఆఫీసర్లకు సూచన ఇవ్వొచ్చని తెలిపింది. జంతుప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని.. మూగజీవాలకు సేవ చేయొచ్చని చెప్పింది. జంతు సంరక్షణ బోర్డు ఆదేశాలపై జంతుప్రేమికులు, గోసంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయమని, జంతువులకు ఆహార వసతి ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. 



Updated Date - 2020-03-29T17:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising