ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి అంచులకు బెలూన్లలో.. అమెరికా స్టార్ట్‌అప్ ప్రయోగం

ABN, First Publish Date - 2020-07-04T23:39:52+05:30

ఇప్పటివరకు టికెట్ కొనుక్కుని విమానం ఎక్కుతున్నాం. ఇక నుంచి అంతరిక్షంలోకి కూడా వెళ్లగలుగుతాం. ఈ కలను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇప్పటివరకు టికెట్ కొనుక్కుని విమానం ఎక్కుతున్నాం. ఇక నుంచి అంతరిక్షంలోకి కూడా వెళ్లగలుగుతాం. ఈ కలను నిజం చేయడానికి అమెరికాలోని ఓ స్టార్ట్‌టప్ కంపెనీ నడుం బిగించింది. అంతరిక్షంలో నుంచి భూమిని సందర్శించాలనుకునే ఔత్సాహికుల కోసం సరికొత్త టూరిజం ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా దీనికోసం స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్‌ను కూడా సృష్టిస్తోంది. సాధారణంగా ప్రెజరైజ్ట్ బెలూన్లు అనగానే కొండ ప్రాంతాల్లో అలా అలా కొంత ఎత్తులో ఎగిరి తిరిగి కిందకొచ్చేస్తాయి. అయితే ఈ స్పేస్ బెలూన్లు మాత్రం భూమి నుంచి అక్షరాలా లక్ష అడుగుల ఎత్తుకు తీసుకెళతాయి. అక్కడి నుంచి భూమిని చూస్తే ఆ మజానే వేరని సంస్థ ధీమాగా చెబుతోంది.


ఒక్కో ట్రిప్ ఆరుగంటల పాటు కొనసాగుతుందని, ఆ సమయంలో బోర్ కొట్టకుండా ఓ బార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నామని సంస్థ చెబుతోంది. ఈ స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్‌ను వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపనున్నట్లు సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ట్రిప్‌కు అయ్యే ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కో టూరిస్టు 1,25వేల డాలర్లు(రూ.93.34.931) చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2020-07-04T23:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising