ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు బోనెట్‌లో కొండచిలువ చిలువ కలకలం

ABN, First Publish Date - 2020-12-26T13:49:45+05:30

కారు బోనెట్‌లో చిక్కుకున్న ఒక కొండచిలువ కాసేపు అక్కడివారినందరినీ భయభ్రాంతులకు గురిచేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: కారు బోనెట్‌లో చిక్కుకున్న ఒక కొండచిలువ కాసేపు అక్కడివారినందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. యూపీలోని ఆగ్రాలో గల ఎల్ఐసీ కాలనీలో ఒక కారు బోనెట్‌లో పెద్ద కొండచిలువ చిక్కుకుంది. దానిని చూసిన ఆ కారు యజమాని, కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. ఈ వార్త తెలుసుకున్నవారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైల్డ్ లైఫ్ టీమ్‌కు సమాచారం అందించారు. వారు అతి కష్టం మీద ఆ కొండచిలువను కారు బోనెట్ నుంచి బయటకు తీయగలిగారు. 


తరువాత దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఈ కాలనీలో గురుమీత్ సింగ్ సోఢీ కుటుంబం ఉంటోంది. వారు తమ కారును ఇంటి బయట నిలిపివుంచుతుంటారు. గురువారం ఉదయం వారికి ఆ  కారు బోనెట్‌ లాక్‌లో నాలుగడుగుల కొండ చిలువ కనిపించింది. దీంతో వారికి ప్రాణాలు పోయినంతపనైంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. వారు ఆ కొండచిలువను కదిలించే ప్రయత్నం చేశారు. అయితే అది అక్కడి నుంచి ఏమాత్రం కదలలేదు. దీంతో వారు ఈ విషయాన్ని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీమ్‌కు తెలియజేశారు. వారు అరగంటపాటు రెస్క్యూచేసి, ఆ  కొండచిలువను బయటకు తీశారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వైల్డ్‌లైఫ్ సంస్థ సీఈవో కార్తీక్ నారాయణ్ మాట్లాడుతూ పాముల విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే తమ లక్ష్యమన్నారు. పామును చూడగానే దానిని కొట్టి చంపకూడదని అన్నారు.

Updated Date - 2020-12-26T13:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising