ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్...ఆగ్రాకు ఆశ్చర్యకరమైన బహుమతి

ABN, First Publish Date - 2020-03-27T15:58:13+05:30

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పురాతన కట్టడమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరానికి ఆశ్చర్యకరమైన బహుమతి తెచ్చిపెట్టింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజ్‌మహల్, ఆగ్రా (ఉత్తరప్రదేశ్) : దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పురాతన కట్టడమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరానికి ఆశ్చర్యకరమైన బహుమతి తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ వల్ల ఆగ్రా నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయి గాలి నాణ్యత పెరిగింది. ఏప్రిల్ 14వతేదీ వరకు విధించిన లాక్‌డౌన్ వల్ల ఆగ్రా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. మార్చి నెలలో ఎయిర్ క్వాలిటీ అనూహ్యంగా పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరీక్షల్లో తేలింది. మార్చి నెలలో ఆగ్రా నగరంలోని గాలిలో రేణువులు, దుమ్మూ, ధూళీ, కార్బన్ మోనాక్సైడ్ శాతం తగ్గిందని పీసీబీ నివేదికలో తేలింది.ఆగ్రాలో లాక్‌డౌన్ సందర్భంగా వాహనాల రాకపోకలను సైతం నిలిపివేయడంతో గాలి నాణ్యత పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆగ్రా విభాగాదిపతి కమల్ కుమార్ చెప్పారు. వాయుకాలుష్యం తగ్గడం వల్ల పురాతన కట్టడమైన తాజ్ మహల్ కూడా కాలుష్యం కాటు నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు ఆగ్రా నగరంలో వ్యాధులు సైతం తగ్గుముఖం పడతాయని కాలుష్యనియంత్రణ అధికారి బీపీ యాదవ్ చెప్పారు. 

Updated Date - 2020-03-27T15:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising