ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుమ్ము, ప్రమాదకర వాయువులతో తాజ్‌

ABN, First Publish Date - 2020-10-15T23:39:57+05:30

తాజ్‌మహల్.. ప్రేమకు చిహ్నమైన ఈ సుందర కట్టడాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని కోరుకోనివారు చాలా అరుదు. ప్రపంచంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: తాజ్‌మహల్.. ప్రేమకు చిహ్నమైన ఈ సుందర కట్టడాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని కోరుకోనివారు చాలా అరుదు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన దీనిని కాపాడేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. లాక్‌డౌన్ ముందు వరకు పర్యాటకులతో కిక్కిరిసిన తాజ్‌మహల్ ఆ తర్వాత బోసిపోయింది. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా రవాణా నిలిచిపోయి, కర్మాగారాలు మూతపడడంతో కాలుష్యం గణనీయంగా తగ్గింది. దీంతో తాజ్‌మహల్ శోభ మరింత ఇనుమడించింది.


అయితే, దేశంలో అన్‌లాక్ మొదలైన తర్వాత మళ్లీ రవాణా మొదలైంది. ఫ్యాక్టరీలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. మరోవైపు నిర్మాణ రంగం కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. దీంతో ఇప్పుడు తాజ్‌మహల్‌కు మళ్లీ ముప్పు ముంచుకొచ్చింది. ఈ సుందర కట్టడం సమీపంలోనే పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో తాజ్‌మహల్‌పై ధూళి మేఘాలు అలముకున్నాయి. తాజ్ చుట్టూ ప్రమాదకర వాయువులు వ్యాపించాయి. దీంతో తాజ్‌మహల్ అందం మసక బారుతోంది.


మరోవైపు, ఆగ్రాలో కాలుష్యం మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో తాము శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఆరోపిస్తున్నారు. గాలిలో పెరుగుతున్న దుమ్ము, ధూళి తాజ్‌మహల్‌ను దెబ్బతీస్తోందని, ప్రజలు కూడా అనారోగ్యం పాలువుతున్నారని చెబుతున్నారు.  

Updated Date - 2020-10-15T23:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising