అలాంటి అమ్మాయిలే కావాలట!.. ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్
ABN, First Publish Date - 2020-09-08T21:03:48+05:30
వాళ్లు అమ్మాయిలకే ఉద్యోగాలు ఇస్తామంటారు. తాము టార్గెట్ చేసిన వాళ్లను ఫోన్లో ట్రాప్ చేయాలని చెబుతారు. అమ్మాయిలు పిలిస్తేనే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారని కహానీలు చెబుతారు. వలలో చిక్కితే చాలు.. అసలు బొమ్మ తామే చూపిస్తామని.. అంతా సింపుల్ అని తేల్చి పారేస్తారు.
వాళ్లు అమ్మాయిలకే ఉద్యోగాలు ఇస్తామంటారు. తాము టార్గెట్ చేసిన వాళ్లను ఫోన్లో ట్రాప్ చేయాలని చెబుతారు. అమ్మాయిలు పిలిస్తేనే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారని కహానీలు చెబుతారు. వలలో చిక్కితే చాలు.. అసలు బొమ్మ తామే చూపిస్తామని.. అంతా సింపుల్ అని తేల్చి పారేస్తారు. తమది డిటెక్టివ్ ఏజెన్సీ అంటూ ఇల్లీగల్ దందా సాగిస్తారు. అవసరమైతే సినిమా ఆఫర్లు కూడా ఇప్పిస్తామని అనైతిక దారులు చూపిస్తారు. హైదరాబాద్లో అరాచకాలకు పాల్పడుతున్న గలీజ్ గాళ్లపై ఏబీఎన్ నిఘా టీమ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. పోలీసులు చేయాల్సిన పనిని తాము గుట్టు చప్పుడు కాకుండా చేస్తామంటున్నారు. ఎక్కువగా మాట్లాడితే అసలు పోలీసులతో పనులు కావని కూడా చెబుతారు. తామే సరైన పరిష్కారం అని నమ్మబలుకుతారు. లక్షలకు లక్షలు బాధితుల నుంచి కొల్లగొడతారు. అలాంటి డిటెక్టివ్ ఏజెన్సీ కేటుగాళ్ల గుట్టును ఏబీఎన్ నిఘా టీమ్ రట్టు చేసింది.
దంపతుల మధ్య తగాదాలు వస్తే సర్దిచెప్పడానికి పెద్దవాళ్లుంటారు. మనస్పర్థలు తలెత్తితే పోలీసులు ఆ పనిచూసుకుంటారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి సఖ్యత కుదురుస్తారు. కుటుంబ కలహాలు పరిష్కరించేందుకే ప్రత్యేకంగా మహిళా పోలీస్స్టేషన్లు కూడా ఉన్నాయి. కానీ, ఇలాంటి సమస్యలను క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగింది ఓ బ్యాచ్. కుటుంబ కలహాలను సెట్ చేస్తామని భారీగా డబ్బులు వసూలు చేస్తారు. వివాహేతర సంబంధాల్లోనూ తలదూరుస్తారు. గంటలు, రోజుల చొప్పున ఛార్జీలు డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఇల్లీగల్ ఏజెన్సీల గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఉప్పందింది. ఇప్పటికే వాళ్ల వారిన పడ్డ బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో ఈ వ్యవహారమేంటో తేల్చాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా టీమ్ రంగంలోకి దిగింది. డిటెక్టివ్ ఏజెన్సీ గుట్టును రట్టు చేసింది. ఏబీఎన్ సీక్రెట్ ఆపరేషన్ వివరాలు వీడియోలో చూద్దాం...
Updated Date - 2020-09-08T21:03:48+05:30 IST