జపాన్ గగనతలంలో వింత బలూన్.. వైరలవవుతున్న వీడియో
ABN, First Publish Date - 2020-06-19T03:44:08+05:30
జపాన్ గగనతలంలో ఓ వింత బెలూన్ వంటి వస్తువు చక్కర్లు కొట్టింది. ఉత్తర జపాన్‌లోని సెండాయ్ నగరంలో...
టోక్యో: జపాన్ గగనతలంలో ఓ వింత బెలూన్ వంటి వస్తువు చక్కర్లు కొట్టింది. ఉత్తర జపాన్‌లోని సెండాయ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సేకరించిన ఫోటోలు, వీడియోల ప్రకారం ‘+’ ఆకారంలో ఉన్న ఓ కర్రకు బెలూన్ వంటి వస్తువు కట్టినట్లు ఉంది. అయితే ఆ కర్ర ఓ ప్రొపెల్లర్‌లా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సెండాయ్ నగర వాతావారణ శాఖ అధికారులు స్పందిస్తూ, ఇది సూర్యాస్తమయం సమయంలో కనిపించిందని, కొన్ని గంటలపాటు ఆకాశంలో అలా కదలకుండా ఉందని చెప్పారు. అయితే కొంత సేపటికి మబ్బులు ఎక్కువగా రావడంతో ఇది వాటిలో కలిసిపోయిందని తెలిపారు.
Updated Date - 2020-06-19T03:44:08+05:30 IST