ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెల్లెలి కోసం సాహసం.. ఆరేళ్ల వీరుడికి అరుదైన గౌరవం..!

ABN, First Publish Date - 2020-07-17T01:50:51+05:30

సాహస వీరుడు అనిపించుకోవడానికి కండబలం అక్కర్లేదు.. గుండెబలం ఉంటే చాలు అని నిరూపించాడు ఆరేళ్ల ఓ బుడతడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: సాహస వీరుడు అనిపించుకోవడానికి కండబలం అక్కర్లేదు.. గుండెబలం ఉంటే చాలు అని నిరూపించాడు ఆరేళ్ల ఓ బుడతడు. ప్రాణంగా ప్రేమించే తన చెల్లెల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాలను అడ్డంగా పెట్టి విశేష ప్రశంసలు అందుకుంటున్నాడు. అమెరికాలోని వ్యోమింగ్‌కి చెందిన బ్రిడ్జర్ వాకర్... ఇటీవల తన చెల్లెల్ని ఓ వీధికుక్క వెంబడించడంతో దాన్నుంచి ఆమెను విడిపించేందుకు బ్రిడ్జర్ అడ్డంగా నిలబడ్డాడు. కుక్క తన ముఖంపై దాడిచేసి చీల్చివేసినా వెనక్కి పారిపోకుండా పోరాడాడు. కొద్దిసేపు పెనుగులాడిన తర్వాత తన చెల్లెల్ని తీసుకుని దూరంగా పరుగెత్తాడు. అతడి గాయాలను సరిచేసేందుకు వైద్యులు రెండు గంటలపాటు సర్జరీ చేయాల్సి వచ్చిందని బ్రిడ్జర్ బంధువు ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ముఖం మీద మొత్తం 90 కుట్లు పడినట్టు తెలిపారు.


వెనక్కి పారిపోకుండా అక్కడే ఎందుకు నిలబడ్డావంటూ వాకర్‌ని ప్రశ్నిస్తే దిమ్మతిరిగే సమాధానం చెప్పడం మరో విశేషం. ‘‘మా ఇద్దర్లో ఎవరైనా చనిపోవాల్సి వస్తే.. అది నేనే కావాలని అనుకున్నాను..’’ అని వాకర్ పేర్కొన్నట్టు సదరు బంధువు వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో... హాలీవుడ్ స్టార్ అన్నే హాత్వే  మొదలు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ వరకు అందరూ అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. కాగా ఈ చిచ్చర పిడుగును ‘‘గౌరవ ప్రపంచ చాంపియన్‌’’ గుర్తిస్తున్నట్టు ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబీసీ) ట్విటర్లో ప్రకటించింది. ‘‘మానవత్వపు అత్యున్నత విలువలకు ప్రతిరూపంగా నిలిచిన అతడి సాహసోపేత చర్యలకు గానూ.. ఆరేళ్ల బ్రిడ్జర్ వాకర్‌ను డబ్ల్యూబీసీ ‘గౌరవ ప్రపంచ చాంపియన్‌’గా గుర్తించామని చెప్పేందుకు గర్విస్తున్నాం. బ్రిడ్జర్.. నువ్వు హీరో..’’ అని డబ్ల్యూబీసీ ట్వీట్ చేసింది. 







Updated Date - 2020-07-17T01:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising