ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 ఏళ్ల బాలుడిపై 21 ఏళ్ల యువతి కేసు.. లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-05-22T21:53:53+05:30

12 ఏళ్ల బాలుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్: 12 ఏళ్ల బాలుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి వాటిని తనకు పంపిస్తున్నాడని ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివశిస్తున్న 21  ఏళ్ల యువతి ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది. ఆన్‌లైన్‌లో సెక్స్ చాట్ చేయాలని, లేకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని  తెలిపింది. దీనికి ఆధారంగా తన మొబైల్‌కు ఆ బాలుడు పంపించిన మెసేజ్‌లు, ఫోటోలకు సంబంధించి 18 స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించింది.


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని విచారించగా ఆ ఫోటోలు, మెసెజ్‌లు తాను పంపలేదని, తన మొబైల్ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయితే వీరిద్దరూ టెలిగ్రాం అప్లికేషన్‌లోని ఓ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారని, అక్కడి నుంచే ఈ బాలుడు ఆమె ఫోన్ నెంబరు సంపాదించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2020-05-22T21:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising