ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకుని.. డాక్టర్లతోనే 101వ బర్త్‌డే చేసుకుని..

ABN, First Publish Date - 2020-07-15T04:01:18+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఓ శతాధిక వృద్ధుడు ఓడించాడు. అదే విజయానందంతో 101వ పుట్టినరోజు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఓ శతాధిక వృద్ధుడు ఓడించాడు. అదే విజయానందంతో 101వ పుట్టినరోజు చేసుకున్నాడు. అతడికి కరోనా చికిత్స అందించిన డాక్టర్లే ఈ బర్త్‌డే కార్యక్రమం నిర్వహించి వేడుక చేశారు. ముంబైలోని హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ థాక్రే హాస్పటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 100 ఏళ్లు పైబడిన అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ అనే వృద్ధుడు ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజులుగా డాక్టర్లు ఇతడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వారి ప్రయత్నం.. గోవింద్‌లోని బతకాలనే కోరిక.. రెండూ కలిసి కరోనాను జయించాయి. దీంతో బుధవారం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే అదే రోజు గోవిండ్ 101వ పుట్టినరోజు కావడంతో మంగళవారమే చిన్నసైజు బర్తడే పార్టీ నిర్వహించారు. డాక్టర్లు అతడి చేత పుట్టిన రోజు కేక్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2020-07-15T04:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising