ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊపిరి పీల్చుకున్న న్యూయార్క్.. జూన్ 3న కరోనా మరణాల సంఖ్య ఎంతంటే..!

ABN, First Publish Date - 2020-06-06T21:03:17+05:30

కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన న్యూయార్క్‌ సిటీ‌లో మొదటిసారిగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. న్యూయార్క్ సిటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన న్యూయార్క్‌ సిటీ‌లో మొదటిసారిగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. న్యూయార్క్ సిటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రోజు న్యూయార్క్ సిటీ‌లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అయితే.. ముగ్గురు వ్యక్తులు మాత్రం కరోనా లక్షణాలతో మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. మృతదేహాలకు కరోనా పరీక్షలు జరిపినట్లు తెలిపారు. వాటికి సంబంధించిన ఫలితాలు ఇంకా అందలేదని పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ అమెరికాలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్ సిటీ.. మహమ్మారికి అతిపెద్ద హాట్‌స్పాట్‌గా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కోరోజు  కరోనా మరణాలు వందల్లో నమోదయ్యాయి. న్యూయార్క్ సిటీలో మార్చి 11న మొదటి కరోనా మరణం సంభవించింది. అనంతరం క్రమంగా ఈ సంఖ్య పెరిగింది.  ఏప్రిల్ 7న అత్యధికంగా 590 మంది కొవిడ్-19 కాటుకు మరణించారు. తర్వాత మరణాల సంఖ్య క్రమంగా తగ్గింది. గత నెల 9వ తేదీన వందలోపు మరణాలు నమోదవ్వగా.. బుధవారం రోజు ఒక్కరు కూడా చనిపోలేదని న్యూయార్క్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వివరించింది. కాగా.. ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా 19.65లక్షల మంది కరోనా బారినపడగా.. 1.11లక్షల మంది మరణించారు. 


Updated Date - 2020-06-06T21:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising