ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో గెలిచిన రెండు వారాల తరువాత బైడెన్‌కు జిన్‌పింగ్ అభినందనలు

ABN, First Publish Date - 2020-11-26T03:25:04+05:30

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు బుధవారం అభినందనలు తెలిపారు. ‘ఇరు దేశాలు ఎటువంటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు బుధవారం అభినందనలు తెలిపారు. ‘ఇరు దేశాలు ఎటువంటి వివాదాలకు, ఘర్షణలకు పోకుండా పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ ప్రపంచశాంతిని, అభివృద్దిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందాం’ అంటూ జిన్‌పింగ్ తన టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండు వారాల తరువాత జిన్‌పింగ్ అభినందనలు తెలపడం విశేషం. నవంబర్ ఏడో తేదీన జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన వెంటనే అనేక దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే చైనా, రష్యా అధ్యక్షులు మాత్రం ఆయనకు అభినందనలు తెలుపలేదు. 


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఆరోపణలు చేయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఎట్టకేలకు దిగొచ్చి అధికార బదిలీకి తన ఆమోదముద్ర వేశారు. దీంతో అమెరికాకు 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బైడెన్‌ను గుర్తిస్తున్నట్టు.. అధికార బదిలీ ప్రక్రియ ఆరంభిస్తున్నట్లు కీలకమైన సాధారణ సేవల పాలనా విభాగం(జీఎస్ఏ) మంగళవారం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఏ విధంగా ఆరోపణలు చేశారో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని.. చైనా వైరస్ గురించి ముందే చెప్పి ఉంటే ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదంటూ ట్రంప్ నిత్యం అంటూనే వచ్చారు. అయితే జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో ఏ విధంగా మైత్రి కొనసాగిస్తారా అన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. 

Updated Date - 2020-11-26T03:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising