ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చా.. కానీ..

ABN, First Publish Date - 2020-03-04T22:17:55+05:30

రెండేళ్ల నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న మొక్క.. అసలు మొక్కే కాదని తెలుసుకుని అమెరికా యువతి కంగుతింది. కేలీ విల్క్స్ అనే యువతికి ఈ వింత అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: రెండేళ్ల నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న మొక్క.. అసలు మొక్కే కాదని తెలుసుకుని అమెరికా యువతి కంగుతింది. కేలీ విల్క్స్ అనే యువతికి ఈ వింత అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని కేలీ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. కేలీ తన పోస్ట్‌లో ఏం రాసిందంటే.. ‘ఈ సక్యులెంట్ మొక్కను రెండేళ్ల నుంచి పెంచుకుంటున్నాను. కిచెన్‌లోని కిటికీ దగ్గరే ఈ మొక్క ఉంటుంది. ఈ మొక్క రంగు, షేప్ అన్నిటిని చూస్తూ రోజూ ఎంతో గర్వపడుతుంటాను. మొక్కకు నీళ్లు పోయడం కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయిస్తాను. నేను తప్ప ఇంకెవరైనా మొక్కకు నీళ్లు పోస్తే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఈ మొక్కను నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను ఈ మొక్కను అందమైన వేజ్‌లోకి మార్చాలని అనుకున్నాను. దీని కోసం ప్లాస్టిక్ కంటెయినర్‌లో ఉన్న మొక్కను బయటకు పీకాను. సరిగ్గా ఇదే సమయంలో కంటెయినర్‌తో పాటు మొక్క కూడా ప్లాస్టిక్ అన్న విషయాన్ని గ్రహించాను. ఇన్నేళ్ల నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తున్న మొక్క నిజమైన మొక్క కాదని.. అది ప్లాస్టిక్ మొక్క అనే నిజం తెలుసుకుని ఎంతో బాధపడ్డాను. గడిచిన రెండేళ్లు కూడా అబద్దంలా అనిపిస్తోంది’ అని రాసుకొచ్చింది. కాగా.. ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లో ఒక్కసారిగా ట్రెండింగ్ అయిపోయింది. కేలీ పోస్ట్‌కు నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కేలీని చూసి జాలిపడాలో, లేక నవ్వాలో అర్థం కావడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.  


Updated Date - 2020-03-04T22:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising