ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ వీడియో: ఐర్లాండ్ ఉప ప్రధానిపై కూల్‌డ్రింక్ పోసిన యువతి!

ABN, First Publish Date - 2020-09-21T21:59:44+05:30

ఐర్లాండ్ ఉప ప్రధానిపై ఓ గుర్తు తెలియని యువతి ఉద్దేశపూర్వకంగా కూల్‌డ్రింక్‌ పోసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్లిన్: ఐర్లాండ్ ఉప ప్రధానిపై ఓ గుర్తు తెలియని యువతి ఉద్దేశపూర్వకంగా కూల్‌డ్రింక్‌ పోసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఐర్లాండ్ ప్రభుత్వం కొత్త మార్గర్శకాలను సిద్ధం చేసింది. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలను ప్రజలకు వివరించేందుకు.. ఐర్లాండ్ ఉప ప్రధాని, భారత సంతతికి చెందిన లియో వరద్కర్.. బహిరంగ ప్రదేశంలో కెమెరా ముందుకు వచ్చారు. కరోనా నిబంధనలను ఆయన ప్రజలకు వివరిస్తున్న సమయంలో అటువైపుగా వచ్చిన ఓ యువతి.. చేతిలో ఉన్న కూల్‌డ్రింక్‌ను లియో వరద్కర్‌పై పారబోసి, అక్కడ నుంచి పరారైంది. ఈ దృశ్యాలను ఆ ప్రదేశంలో ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన లియో వరద్కర్.. ఈ ఘటనను సాకుగా చూపి, అదనపు సెక్యూరిటీని కోరలేదని వివరించారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన పాలనా విధానం నచ్చకుంటే.. విమర్శించాలి కానీ ఇదేం పని’ అంటూ కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2020-09-21T21:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising