ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన టికెట్లను బుక్ చేసి.. రూ.3.2 కోట్లు సంపాదన.. చివరకు సీన్ రివర్స్..!

ABN, First Publish Date - 2020-06-18T22:14:49+05:30

నాలుగేళ్ల వ్యవధిలోనే ఏకంగా 900 విమాన టికెట్లను బుక్ చేసిందామె.. అంటే సగటున ఏడాదికి 225 విమాన ప్రయాణాలన్నమాట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాంజింగ్, చైనా: నాలుగేళ్ల వ్యవధిలోనే ఏకంగా 900 విమాన టికెట్లను బుక్ చేసిందామె.. అంటే సగటున ఏడాదికి 225 విమాన ప్రయాణాలన్నమాట.. ఈ లెక్కన ఆమెకు విమాన ప్రయాణాలంటే తెగ ఇష్టం అని ఓ అభిప్రాయానికి వచ్చేస్తే పప్పులో కాలేసినట్లే.. ఆమె విమాన టికెట్లను బుక్ చేస్తుంది కానీ.. ప్రయాణం చేయదు.. ఓ పక్కా ప్రణాళికతో ఎంపిక చేసిన విమానాల్లో టికెట్లను బుక్ చేస్తుంటుంది.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విమానాలు రద్దవుతుంటాయి.. కానీ ఆమె మాత్రం డబ్బులతో పండగ చేసుకుంటుంటుంది.. విమాన సర్వీసు రద్దయితే ఆమెకు మహా అయితే టికెట్ డబ్బులే వెనక్కి వస్తాయి కదా అనుకుంటే పొరపాటే.. ఆ టికెట్ డబ్బులతో పాటు.. ఫ్లైట్ డిలే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తుంటాయి.. చైనాకు చెందిన ఓ 45 ఏళ్ల మాయోపాయాలివి..


చైనాలోని నాంజింగ్ కు చెందిన లీ అనే మహిళ 2015 నుంచి 2019 వరకు దాదాపు 900 విమాన టికెట్లను బుక్ చేసుకుంది.. వాతావరణాన్ని అంచనా వేయడంలో సిద్ధహస్తురాలైన ఆమె.. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడే పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఉంటాయో చూసుకునేది.. ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరే విమాన సర్వీసులను బుక్ చేసుకునేది. దాంతో పాటే ఫ్లైట్ డిలే/కేన్సిల్ ఇన్సూరెన్స్‌లను కూడా కొనుగోలు చేసేది. తన ఒక్కరి పేరునే పదే పదే వాడితే అనుమానాలు వస్తాయనుకుని.. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా వాడుకుంది.. మొత్తం 20 మంది పేర్లతో టికెట్లను బుక్ చేసుకుని.. ఏకంగా రూ.3.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులను సంపాదించగలిగింది. కాగా.. ఇన్సూరెన్స్ ఏజెంట్లకు అనుమానం రావడంతో.. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో లీ ని నాంజింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-06-18T22:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising