ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18వేల అడుగుల ఎత్తులో జన్మించిన బుడతడు.. పేరు ఏంటంటే!

ABN, First Publish Date - 2020-08-13T22:25:44+05:30

అమెరికాకు చెందిన ఓ మహిళ తన కుమారుడికి ‘స్కై’ అని పేరు పెట్టింది. అదేంటి.. ఆమెకు వేరే పేరే దొరకలేదా అని అనుకుంటున్నారా.. అందుకు ఓ కార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ తన కుమారుడికి ‘స్కై’ అని పేరు పెట్టింది. అదేంటి.. ఆమెకు వేరే పేరే దొరకలేదా అని అనుకుంటున్నారా.. అందుకు ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు. విమానం దాదాపు 18వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులొచ్చాయి. ఈ క్రమంలో క్రిస్టెల్ హిక్స్ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. కాగా.. క్రిస్టెల్ హిక్స్ 18వేల అడుగుల ఎత్తులో తన కుమాడికి జన్మనివ్వడం.. అది ఆ బుడ్డోడికి మొదటి ప్రయాణం కావడంతో ఆమె తన కొడుకుకు ప్రత్యేకమైన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో క్రిస్టెల్ హిక్స్ తన కుమారుడికి ‘స్కై’గా నామకరణం చేశారు. ఇదిలా ఉంటే.. క్రిస్టెల్ హిక్స్, స్కై ఎయిరాన్ హిక్స్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెలలు నిండకముందే స్కై ఎయిరాన్ హిక్స్ జన్మించడంతో.. ఆ చిన్నోడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-13T22:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising