ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలుపు తీయగానే కనిపించిన దృశ్యానికి.. ఆస్ట్రేలియాలో..

ABN, First Publish Date - 2020-04-01T21:09:55+05:30

ఆస్ట్రేలియాలో ఓ మహిళకు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎదురైంది. వివరంగా చెప్పాలంటే.. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన మహిళ గత సోమవారం తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియాలో ఓ మహిళకు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎదురైంది. వివరంగా చెప్పాలంటే.. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన మహిళ గత సోమవారం తన ఇంటి తలుపు తీసి బయటకు అడుగు పెట్టే సమయంలో.. సరిగ్గా తలుపు ఎదురుగా కొండచిలువ విశ్రాంతి తీసుకోవడం కనిపించింది. కొండచిలువ ఆకారం, రంగు చూసిన మహిళకు గుండె అదిరింది. వెంటనే పాములు పట్టే వారికి సమాచారమిచ్చింది. కొండచిలువను పట్టడానికి వచ్చిన టోని హ్యారిసన్ అనే వ్యక్తి కూడా దాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. తన జీవితంలో ఇంత పెద్ద కొండచిలువను ఎన్నడూ చూడలేదని చెప్పాడు. 


ఇది బర్మీస్ కొండచిలువ అని, 14.8 అడుగుల సైజు, 80 కిలోల బరువు ఉన్నట్టు టోనీ తెలిపాడు. మనుషులు ఏం తింటారో అదే తింటూ ఈ కొండచిలువ మనిషి జాతితో పోటీ పడుతుందని వివరించాడు. అంతేకాకుండా ఈ కొండచిలువ వైరస్‌లను కూడా విడుదల చేస్తుందని పేర్కొన్నాడు. కాగా.. కొండచిలువ ఫొటోలను టోనీ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వాటిని చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళ అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

Updated Date - 2020-04-01T21:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising