క్యాబ్‌లో ఫోన్ మర్చిపోయి.. నల్ల జాతీయుడే దొంగతనం చేశాడంటూ..
ABN, First Publish Date - 2020-12-30T14:36:57+05:30
అమెరికాలో జాత్యహంకారం ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నల్ల జాతీయులపై తెల్ల
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకారం ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు మొదటి నుంచి వివక్ష చూపుతూ వస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే వివిక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్న తెల్ల యువతి తన ఐఫోన్‌ను పోగొట్టుకుంది. ఫోన్ ఎలా పోయిందో తెలియకపోవడంతో 14 ఏళ్ల నల్ల జాతీయుడిపై అపవాదు వేసింది. అతడే తన ఫోన్‌ను దొంగిలించాడంటూ హంగామా చేసింది. చివరకు ఆమె తన ఫోన్‌ను క్యాబ్‌లో మర్చిపోయినట్టు తెలిసింది.
బాధిత నల్ల జాతీయుడు ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. హోటల్‌లో యువతి హంగామా చేసిన వీడియోను పోస్ట్ చేసి జరిగింది తెలిపాడు. బాధిత యువకుడు ప్రముఖ ట్రంపెటర్(బాకా ఊదే వ్యక్తి) కేయన్ హరాల్డ్ కొడుకు కావడం విశేషం. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. యువతి తన కొడుకుపై దాడి కూడా చేసిందని తెలిపారు. ఈ ఘటన వల్ల తన కొడుకు మనోవేదనకు గురయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2020-12-30T14:36:57+05:30 IST