తల్లిని సమాధి చేసిన కన్నకొడుకు
ABN, First Publish Date - 2020-05-09T14:06:50+05:30
కొడుకును నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, వృద్ధాప్యంలో పక్షవాతం బారిన పడింది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ పుత్రరత్నం, బాధ్య
- 3రోజుల అనంతరం వెలికితీత.. చైనాలో దారుణం
బీజింగ్, మే 8: కొడుకును నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, వృద్ధాప్యంలో పక్షవాతం బారిన పడింది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ పుత్రరత్నం, బాధ్యతను భారంగా భావించి తల్లిని సజీవ సమాధి చేశాడు. ఈ దారుణ ఘటన చైనాలో చోటుచేసుకుంది. షాంజీ ప్రావిన్స్‌లోని జింగ్‌బియాన్ కౌంటీకి చెందిన మా(58) తల్లి వాంగ్(79) గత కొంతకాలంగా పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీంతో మా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. 3రోజుల క్రితం తల్లిని మోసుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడ ఆమెను సమాధి చేసి ఇంటికి వచ్చేశాడు. ఆమె జాడ లేకపోవడంతో.. చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో మా తన తల్లిని సమాధి చేసిన చోటు చూపించాడు. వారు వెంటనే ఆమెను బయటికి తీయగా కొన ఊపిరితో కనిపించింది. వెంటనే వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. మా పై హత్యాయత్నం కేసు నమోదైంది. సమాధిని పైపైనే పూడ్చటం వల్ల యాంగ్ బతికిబట్టకట్టిందని అధికారులు చెప్పారు.
Updated Date - 2020-05-09T14:06:50+05:30 IST