ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలాగైనా మద్యం అమ్మాలని పాత పద్ధతిలో ఇలా ప్లాన్ చేశారు..!

ABN, First Publish Date - 2020-08-09T23:51:29+05:30

కరోనా మహమ్మారి బారినపడకుండా.. వ్యాపారంలో నష్టపోకుండా ఉండేందుకు ఇటలీలోని మద్యం వ్యాపారులు.. పాత పద్ధతినే కొత్తగా అమలు చేస్తున్నారు. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారి బారినపడకుండా.. వ్యాపారంలో నష్టపోకుండా ఉండేందుకు ఇటలీలోని మద్యం వ్యాపారులు.. పాత పద్ధతినే కొత్తగా అమలు చేస్తున్నారు. దీంతో ఇటలీలో ప్రస్తుతం వైన్ విండోలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ దేశాలన్నీ కరోనా కారణంగా ఇప్పటికే సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో చైనాలో బుబోనిక్ ప్లేగు మరోసారి ఉనికి చాటుకుంది. దీంతో కరోనాతో చస్తుంటే.. మళ్లీ ఈ బుబోనిక్ ప్లేగు ఏంటనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఈ బుబోనిక్ ప్లేగు ఈ తరానికి మాత్రమే కొత్తది కానీ.. ఈ ప్రపంచానికి కొత్తది కాదు. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ  బుబోనిక్ ప్లేగు.. గతంలోనే ప్రపంచాన్ని కుదిపేసింది. 1347లో యూరప్ మొత్తం వ్యాపించి.. నాలుగేళ్లలో సుమారు 20 కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. బుబోనిక్ ప్లేగు ఇటలీలో విలయం సృష్టిస్తున్న సమయంలో అప్పటి మద్యం వ్యాపారులు వినూత్నంగా ఆలోచించి.. బుబోనిక్ ప్లేగు మహమ్మారి బారినపడకుండా మద్యం అమ్మడానికి ఓ కొత్త మార్గాన్ని కనిపెట్టారు. భౌతిక దూరం పాటిస్తూనే మద్యాన్ని అమ్మడం కోసం.. గోడలకు చిన్న చిన్న రంధ్రాలు (గ్లాస్ పట్టేంత) చేసి.. వాటి ద్వారా కస్టమర్లకు వైన్‌ను సరఫరా చేశారు. కాలక్రమంలో ఆ రంధ్రాలే.. వైన్ విండోలుగా పిలువబడ్డాయి. కాగా.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో.. ఇటలీలోని మద్యం వ్యాపారులు.. తమ పూర్వీకులు అనుసరించిన విధానాన్నే ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఇటలీలో మళ్లీ.. వైన్ విండోలు తెరుచుకున్నాయి. 


Updated Date - 2020-08-09T23:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising