ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జో బైడెన్ ఉద్వేగభరిత ప్రసంగం..!

ABN, First Publish Date - 2020-12-15T23:06:17+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోమవార రోజు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్‌లో డె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోమవార రోజు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్‌లో డెమొక్రటిక్ నేత జో బైడెన్ విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ గెలుపు ఖరారైంది. ఈ క్రమంలో స్పందించిన జో బైడెన్.. ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. డొనాల్డ్ ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ నేతలు.. ప్రజల నిర్ణయాన్ని అంగీకరించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ‘ప్రజల సంకల్పాన్ని, చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడానికి నిరాకరించారు. ఇటువంటి పరిస్థితిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే జోత్యి చాన్నాళ్ల క్రితమే వెలిగింది. మహమ్మారి గానీ అధికార దుర్వినియోగం కానీ దాన్ని చల్లార్చలేవని స్పష్టమైంది’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికన్లందరికీ తాను ప్రెసిడెంట్‌ని అంటూ బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. మమమ్మారిని కట్టడి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చేప్పారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా మొండిగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-12-15T23:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising