ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మూలాలు తెలుసుకునేందుకు చైనా వెళ్లనున్న డబ్ల్యూహెచ్ఓ టీమ్

ABN, First Publish Date - 2020-07-09T04:43:34+05:30

కరోనా మూలాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కరోనా మూలాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన సభ్యులు చైనా వెళ్లనున్నారు. డబ్ల్యూహెచ్ఓ టీమ్ చైనా రానున్నట్టు చైనా విదేశాంగశాఖ అధికారి జావో లిజియాన్ మీడియాకు తెలియజేశారు. కాగా.. కరోనా మహమ్మారి మొట్టమొదటగా చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. వూహాన్‌లో మొదలైన వైరస్ కొద్ది రోజుల్లోనే ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ గురించి వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ డబ్ల్యూహెచ్ఓకు ఆరు నెలల క్రితం తెలియజేసింది. కరోనా మహమ్మారి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చైనాకు వీలైనంత త్వరగా అంతర్జాతీయ నిపుణులను పంపేలా చైనాతో అంగీకారం చేసుకున్నట్టు కూడా జనవరిలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అయితే ఇదంతా జరిగిన ఆరు నెలల తరువాత డబ్ల్యూహెచ్ఓ టీమ్ కరోనా మూలాలను తెలుసుకునేందుకు వెళ్లడం విశేషం. మరోపక్క డబ్ల్యూహెచ్ఓ చైనా ఆడించినట్టు ఆడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి తెలియజేయడంలో డబ్ల్యూహెచ్ఓ ఆలస్యం చేసిందంటూ ట్రంప్ అనేక సార్లు విరుచుకుపడ్డారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 20 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా దాదాపు ఐదున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-09T04:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising