ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మూలాలను తెలుసుకునేందుకు చైనాకు వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ నిపుణులు

ABN, First Publish Date - 2020-07-14T01:12:21+05:30

కరోనా మహమ్మారి మూలాలను పరిశోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కరోనా మహమ్మారి మూలాలను పరిశోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి ఇద్దరు నిపుణులు చైనాకు వెళ్లారు. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో కలిసి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పనిచేయనున్నట్టు చైనా విదేశాంగశాఖ అధికారి హువా చున్‌యింగ్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నిపుణులు చైనాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఇదే విధంగా పర్యటిస్తారని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి మూలం తెలుసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. కరోనా మూలం తెలుసుకోవాలంటే అనేక దేశాలు తిరగాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. త్వరలో అవసరమైన దేశాల్లో ఇదే మాదిరిగా డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పరిశోధనలు జరపనున్నారు. కరోనా మూలం తెలుసుకోవడం చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గత నెల చెప్పారు. కరోనా మూలాల గురించి తెలిస్తే మహమ్మారితో మరింత సమర్థవంతంగా పోరాటం చేయవచ్చని అన్నారు. కాగా.. చైనాలోని వూహాన్‌లో జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్టు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మరోపక్క స్పెయిన్‌లోని డ్రైనేజీ నీళ్లలో సైతం కరోనా వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019 మార్చిలో సేకరించిన డ్రైనేజీ నీళ్లలో ఈ వైరస్ లభ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

Updated Date - 2020-07-14T01:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising