ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ మోదీ!

ABN, First Publish Date - 2020-09-28T13:22:49+05:30

భారత ప్రధాని మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రాస్‌ అధనోమ్‌ ఘిబ్రేయిసస్‌ ప్రశంసలు కురిపిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనాపై పోరులో సాయం ప్రకటనపై 
  • డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ప్రశంసలు

న్యూయార్క్‌, సెప్టెంబరు 27: భారత ప్రధాని మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రాస్‌ అధనోమ్‌ ఘిబ్రేయిసస్‌ ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న దేశాలకు సాయంలో భాగంగా తమ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామన్న మోదీని ఆయన ప్రశంసించారు.


‘‘కరోనాపై పోరులో మీ నిబద్ధతకు ధన్యవాదాలు. ప్రపంచ శ్రేయస్సు కోసం వనరులను అంద రూ కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారిని ఓడించగలం’’ అని టెడ్రాస్‌ ట్వీట్‌ చేశారు. కరోనాపై పోరాడుతున్న అన్ని దేశాలకూ టీకాను సరఫరా చేస్తామని ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ సమావేశంలో మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ప్రపంచానికి కరోనా టీకాను అందించాలన్న మీ కృషి, దూరదృష్టి పట్ల మాకెంతో గర్వంగా ఉంది. ఇది భారత్‌కు గర్వించదగ్గ క్షణాలు. కరోనా బారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి మీరు చేస్తున్న కృషి అందరి అవసరాలను తీరుస్తుంది’’ అని అదర్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-09-28T13:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising