ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెటర్ అమెరికా కోసం ట్రంప్‌కు ఓటేయండి: మెలానియా ట్రంప్

ABN, First Publish Date - 2020-10-30T22:53:45+05:30

బెటర్ అమెరికా కోసం నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో తన భర్తకు ఓటేయాలని డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అమెరికా భవిష్యత్తుపై ట్రంప్ దృష్టిపె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: బెటర్ అమెరికా కోసం నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో తన భర్తకు ఓటేయాలని డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అమెరికా భవిష్యత్తుపై ట్రంప్ దృష్టిపెట్టారని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల నేతలు ప్రచార జోరును పెంచారు. ఈ క్రమంలో మెలానియా ట్రంప్.. ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ‘నెగటివిటీని, భయంకరమైన సందేశాలను మీడియా మన ఇళ్లలోకి తీసుకొస్తోంది. కొన్ని పెద్దపెద్ద టెక్ కంపెనీలు పొలిటికల్ సెన్సార్షిప్‌కు పాల్పడుతున్నాయి. ఇటువంటి సమయంలో మనకు ఏది ముఖ్యమో దాన్నే మనం గుర్తుంచుకోవాలి. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల భవిష్యత్తుపై దృష్టిపెట్టింది’ అన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా సురక్షితంగా ఉందన్నారు. అంతేకాకుండా ట్రంప్ తన నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ‌ను పరగులుపెట్టించారన్నారు. నిరుద్యోగరేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో అమెరికా సైన్యం గతంలో కంటే ఎక్కవ శక్తివంతం అయిందని తెలిపారు.


Updated Date - 2020-10-30T22:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising