ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తార‌స్థాయికి చేరిన‌ నల్లజాతి నిరసనలు

ABN, First Publish Date - 2020-05-31T12:31:30+05:30

నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం పలు నగరాల్లో వేలమంది నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మినియాపొలి్‌సలో కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా వరుసగా నాలుగో రోజూ భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మినియాపొలిస్‌, మే 30: నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం పలు నగరాల్లో వేలమంది నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మినియాపొలి్‌సలో కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా వరుసగా నాలుగో రోజూ భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా యువత విధ్వంసానికి, లూటీలకు పాల్పడ్డారు. దుకాణాలను, రెస్టారెంట్లను తగులబెట్టారు. డెట్రాయిట్‌ నగరంలో ప్రదర్శనకారులపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అట్లాంటాలో పోలీసు కార్లను ధ్వంసం చేశారు.


న్యూయార్క్‌లో పోలీసులతో తలపడ్డారు. పలు నగరాల్లో నిరసనకారులు పోలీసులపై కాల్పులు జరిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హింస తలెత్తిన చోట్ల అడిగిన వెంటనే సైన్యాన్ని అందుబాటులో ఉంచాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. జార్జి ఫ్లాయిడ్‌ గొంతుపై మోకాలితో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి, చంపిన పోలీసు అధికారి డెరెక్‌ చావిన్‌(44)ను అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-31T12:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising