ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. విరామ సమయాన్ని ఫుల్‌గా వాడేసుకుంటున్న డాక్టర్లు!

ABN, First Publish Date - 2020-04-04T22:35:17+05:30

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలనే పణంగాపెట్టి.. కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలనే పణంగాపెట్టి.. కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్యసిబ్బందికి కాస్త విరామ సమయం దొరికితే.. వారు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో మీకు తెలుసా? ప్రపంచంలోని అందరి డాక్టర్ల గురించి పక్కన పెడితే.. అమెరికాకు చెందిన డాక్టర్లు మాత్రం విరామ సమయాన్ని ఫుల్‌గా వాడేసుకుంటున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని దృశ్యాల ప్రకారం అమెరికాలోని ఒరిగాన్  ప్రాంతానికి చెందిన నలుగురు డాక్టర్లు.. ఓ పాటకు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతున్నారు. డాక్టర్లకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు ఒక మిలియన్ మంది వీక్షించారు. వీక్షించిన వారిలో కొందరు.. డాక్టర్లను ‘రియల్ హీరో‌స్‌’ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2020-04-04T22:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising