ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైట్‌హౌజ్‌లో వేద పఠనం

ABN, First Publish Date - 2020-05-09T14:14:30+05:30

అమెరికాలో కొనసాగుతున్న కరోనా కల్లోలానికి అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ చేయని ప్రయత్నం లేదు. ఏదీ సఫలం కాకపోవడంతో.. ఇప్పుడు దేవుడిపై భారం వేసే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమెరికన్ల రక్షణ కోసం హిందూ పూజారితో నిర్వహణ

వాషింగ్టన్‌, మే 8: అమెరికాలో కొనసాగుతున్న కరోనా కల్లోలానికి అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ చేయని ప్రయత్నం లేదు. ఏదీ సఫలం కాకపోవడంతో.. ఇప్పుడు దేవుడిపై భారం వేసేశారు. జాతీయ ప్రార్థన దినోత్సవం సందర్భంగా శుక్రవారం వైట్‌హౌజ్‌లో ‘వేదిక్‌ శాంతి పఠనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ‘స్వామి నారాయణ్‌ మందిర్‌’ పూజారి హరీశ్‌ బ్రహ్మభట్‌ నిర్వహించారు. ప్రార్థనకు ముందు బ్రహ్మభట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది శాంతి కోసం చేసే అద్భుతమైన హిందూ ప్రార్థన. ఇది యజుర్వేదంలో ఓ భాగం. ఈ ప్రార్థన ఒక్క అమెరికాకే కాదు.. స్వర్గానికి, భూమ్యాకాశాలకు, సకల జీవరాశికి, ప్రకృతికి అన్నింటికీ శాంతి చేకూరుస్తుంది’’ అని అన్నారు. ప్రార్థనానంతరం ఆయన ఆ సారాంశాన్ని ఆంగ్లంలో బోధించారు.

Updated Date - 2020-05-09T14:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising