ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: సిడ్నీ నుంచి స్వదేశానికి బయల్దేరిన భారతీయులు

ABN, First Publish Date - 2020-08-10T21:25:17+05:30

వందే భారత్ మిషన్‌లో భాగంగా సిడ్నీ నుంచి ప్రత్యేక విమానం కొద్ది గంటల క్రితం భారతదేశానికి బయల్దేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: వందే భారత్ మిషన్‌లో భాగంగా సిడ్నీ నుంచి ప్రత్యేక విమానం కొద్ది గంటల క్రితం భారతదేశానికి బయల్దేరింది. ఏఐ 301 విమానం మరి కొద్ది గంటల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. కేరళ సంఘటన తరువాత వందే భారత్ మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారన్న చర్చ జరిగింది. అయితే అటువంటిది ఏమీ లేదని ఇప్పటికే విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పష్టం చేశారు. ఒక్క ఆదివారం రోజే ప్రపంచదేశాల నుంచి ఆరు వేలకు పైగా భారతీయులు భారత్‌కు చేరుకున్నట్టు ఆయన తెలిపారు. అనుకున్న విధంగానే ప్రపంచదేశాల నుంచి భారతీయులు తమ స్వదేశానికి చేరుకుంటారని ఆయన అన్నారు. కాగా.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తీసుకొచ్చేందుకు మే 6న కేంద్రం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్‌లో ఇప్పటికే నాలుగు విడదలు పూర్తి కాగా.. ప్రస్తుతం ఐదో విడత కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు పది లక్షలకు పైగా భారతీయులు తమ మాతృభూమికి చేరుకున్నారు. కేవలం విమానాల ద్వారానే కాకుండా యుద్దనౌకల్లోనూ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తీసుకొస్తోంది. ఇప్పటికే ఇరాన్, శ్రీలంక, మాల్దీవుల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు యుద్దనౌకల ద్వారా స్వదేశానికి చేరుకున్నారు.

Updated Date - 2020-08-10T21:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising