వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జో బైడెన్!
ABN, First Publish Date - 2020-08-23T02:55:42+05:30
గణేష్ చతుర్థి సందర్భంగా.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా
వాషింగ్టన్: గణేష్ చతుర్థి సందర్భంగా.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, భారత్ సహా ఇతర దేశాల్లో గణేష్ చతుర్థిని జరుపుకొనే ప్రతి ఒక్కరి విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. జో బైడెన్ గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్-అమెరికన్ల ఓట్లపై గురిపెట్టిన జో బైడెన్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-08-23T02:55:42+05:30 IST