ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కరోనా విలయం.. ఆరు రోజుల్లోనే..!

ABN, First Publish Date - 2020-11-22T20:46:01+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యూఎస్‌లోని ప్రజలు రికార్డు స్థాయిలో మహమ్మారి బారినపడుతున్నారు. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యూఎస్‌లోని ప్రజలు రికార్డు స్థాయిలో మహమ్మారి బారినపడుతున్నారు. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 మిలియన్లు దాటింది. యూనివర్సిటీ రియల్ టైమ్ ట్రాకర్‌లోని సమాచారం ప్రకారం ఆరు రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది మహమ్మారి బారినపడటంతో.. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య  1,20,19,960కు చేరింది. ఇదే సమయంలో అమెరికాలో ఇప్పటి వరకు 2,55,414 మంది కరోనా కాటుకు మరణించారు. 


ఇదిలా ఉంటే.. కరోనా కేసులు విపరీతంగా పెరిగుతుండటంతో అమెరికాలోని పలు పట్టణాలు తిరిగి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటికి రావొద్దని ప్రజలను అధికారులు కోరుతున్నారు. న్యూయార్క్ సిటీలో స్కూళ్లు మళ్లీ మూతపడగా.. కాలిఫోర్నియాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద నగరమైన చికాగోలో సోమవారం నుంచి స్టే హోం ఆదేశాలు అమలు కానున్నాయి. 


Updated Date - 2020-11-22T20:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising