ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరోగమన బాటలో అమెరికా, యూరప్

ABN, First Publish Date - 2020-03-16T10:28:46+05:30

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రభావం వల్ల అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో పడడం ఖాయమని జేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రపంచానికీ ముప్పు తప్పదు
  • కోవిడ్‌-19 ప్రభావంపై ఆర్థికవేత్తల అంచనా


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రభావం వల్ల అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో పడడం ఖాయమని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక రంగం యావత్తు మరిన్ని కష్టా ల్లో పడే ప్రమాదం వెంటాడవచ్చు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్‌ వంటి పరిణామాల వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటోంది. ఈ లోగా తాజాగా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కోవిడ్‌-19 మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అదుపు చేయడంలో భాగంగా షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు, జనం అధిక సంఖ్యలో పాల్గొనే వేడుకలు, సమావేశాలు వంటివి ప్రపంచంలో పలు దేశాలు తాత్కాలికంగా నిషేధించడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రారంభంలో దీన్ని అరికట్టడం తేలికే అనిపించినా గత కొద్ది వారాలుగా వైరస్‌ త్వరితగతిన వ్యాపిస్తూ పలు దేశాలను చుట్టుముట్టడం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఆటుపోట్లకు గురి చేస్తోంది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల స్టాక్‌ మార్కెట్లలో గత దశాబ్ది కాలం లో కనీవినీ ఎరుగని స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయని జేపీ మోర్గాన్‌ ఆర్థికవేత్తలు తాజా నివేదికలో పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2 శాతం, రెండో త్రైమాసికంలో 3 శాతం దిగజారవచ్చునని, అదే సమయంలో యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 1.8 శాతం, 3.3 శాతం దిగజారే ప్రమాదం ఉన్నదని వారు అంచనా వేశారు. 


ఆర్థికవేత్తల నిర్వచనం ప్రకారం వరుసగా రెండు త్రైమాసికాలు జీడీపీ ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తే టెక్నికల్‌గా అది తిరోగమన దశ అవుతుంది. కాగా  ప్రపంచ దేశాలు సమన్వయపూర్వకంగా, సుసంఘటితంగా నిలిచి ఆర్థిక కార్యకలాపాలను పునరుజ్జీవింపచేసే అవకాశాలు కూడా అంతగా కనిపించకపోవడం పరిస్థితిని తీవ్రతరం చేస్తోందన్నారు. దీనికి తోడు ఆర్థిక మార్కెట్లలో ధరల్లో ఏర్పడిన భారీ క్షీణత కూడా తిరోగమనానికి కారణం కావడంతో పాటు పలు కంపెనీల క్రెడిట్‌ నాణ్యత దెబ్బతింటుందని వారు హెచ్చరించారు. కోవిడ్‌-19 ప్రభావానికి తీవ్రంగా గురైన రంగాలకు ఉద్దీపనలు అందించడం, కేంద్రీయ బ్యాంకులు ద్రవ్యపరమైన చర్యలతో దీన్ని దీటుగా ఎదుర్కొనే దిశగా ప్రపంచం అడుగేయాలని కూడా వారు సూచించారు. కాగా 1835 నుంచి ఏర్పడిన ప్రతీ ఒక్క బేర్‌ మార్కెట్‌ మూడు ప్రమాద సూచీలను ఇచ్చాయని, ఈ కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏమీ లేదని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ ఆర్థికవేత్తలు అంటున్నారు.

Updated Date - 2020-03-16T10:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising