ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు..

ABN, First Publish Date - 2020-09-27T06:12:33+05:30

అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్టు కనపడుతోంది. దేశంలో కేసుల సంఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్టు కనపడుతోంది. దేశంలో కేసుల సంఖ్య మరోమారు 50 వేలు దాటింది. శుక్రవారం అమెరికా వ్యాప్తంగా 55,054 కరోనా కేసులు నమోదైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కలు చెబుతున్నాయి. గత నెలన్నర సమయంలో దేశవ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆగస్టు 14న అమెరికాలో 64,350 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే దేశంలో 50 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 70 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా కారణంగా 2,03,918 మంది మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-09-27T06:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising